Tuesday, June 27, 2017

(డర్టీ ) పాలిటిక్స్ - (సిల్లీ) పాలిటిక్స్

పాలిటిక్స్ అనేది రాజనీతి శాస్త్రం  ...

నేడు అది వట్టి రాజకీయం గా రూపాంతరం చెంది ఉన్నది  ...

రాజకీయం అంటే ఏదో ఒక మార్గాన అధికారం సంపాదించడం గా మారిపోయింది ...

మంచి నాయకులు తక్కువే ... మంచి పౌరులు (ప్రజలు ) తక్కువే ...

దేశాన్ని ఉద్దరించాల్సిన యువత కులం, మతం, ప్రాంతీయ విభేదాలతో మంచి వైపున నిలవటం లేదు ... 

నిజం గా చరిత్ర లో ఎన్నో దృష్టాంతాలు ఉన్నాయ్ ...

ఆనాడు జీసస్ మత ముసుగులో జరుగుతున్నా చెడుని ప్రశ్నించి మంచి మార్గమును బోధించి నందుకే కదా 
దోపిడీ దొంగలకు కూడా పడని సిలువ మరణమును ఈ పాపిష్ఠి  లోకం ఆయనకు బహుమతి గా ఇచ్చింది ... 
(ఆయన దేవుని కన్నా ముందు ఒక మానవతావాది ... నేను ఒక హిందువుని అయినా ఈ విషయాన్ని చెప్తున్నాను కారణం మంచి వారిని ఈ లోకం చేతకాని వారిలా చూస్తోంది ... ఇంకెందరో మహానుభావులు హత్యగావింపబడ్డారు )


నేడు రాజనీతి శాస్త్రంలో ఉన్న నీతి (ఎథిక్స్ ) అనేది మచ్చు కైనా కానరావట్లేదు  ...

అదే (డర్టీ ) పాలిటిక్స్ - (సిల్లీ) పాలిటిక్స్


నిజమైన రాజకీయం గురించి మనం మాట్లాడుకోవాలంటే ముగ్గురు గురు శిష్యుల గురించి  తెలుసుకోవాలి ...

వారే

సోక్రటీస్ 

ప్లేటో 

అరిస్టాటిల్ 

ఆనాటి నుండి మంచి చెప్పేవారు ఎన్నో కష్టాల పాలు గావింప బడ్డారు ...
చంపివేయబడ్డారు ...

అందులో సోక్రటీస్ ప్రథముడు ...

అసలు ఆదర్శ రాజ్యం అంటే ఎలా ఉండాలో సోక్రటీసు తన శిష్యుడైన ప్లేటో సందేహాలతో చెప్పాడు ... దాన్ని పప్లేటో గ్రంథస్తం చేసాడు ...

ఆ బృహత్గ్రంథమే ది రిపబ్లిక్ 

ఆ ప్లేటో శిష్యుడే మన అరిస్టాటిల్ ... 

ది రిపబ్లిక్ గ్రంధం గురించి తర్వాతి పోస్టులో తెలియజేయగలను సమయాభావం వల్ల ... 

జైహింద్ 

మీ శ్రీ 




Wednesday, March 22, 2017

GOVERNMENT FORMS

Oligarchy – Government led by rich people

Democracy – Government which treats all people are equal

Tyranny –  Government lead by dictator

But unfortunately all these are not good ...

But many people ask why ... they hope democracy is good when compared to other two but democracy is also not good …

That’s why India now suffers with many burning issues …

ఎందుకంటే 

ఆలీఘార్కి లో ధనికులు పేదవారికి ఎటువంటి అవకాశం ఇవ్వరు ... అందువల్ల ధనికులు పేదలు అనే రెండు వర్గాలు ఎపుడు కోట్లాడుకొంటూ ఉంటాయి ... 

టిరనీ  లో నియంతృత్వ పోకడలు ఎక్కువగా ఉంటాయి  ... అందుకే అది కూడా మంచి ఫలితాలను ఇవ్వలేదు ... 

డెమోక్రసీ లో అదే మన ప్రజాస్వామ్యం లో కూడ లోపాలు ఉన్నాయ్ ... 

అందరూ సమానం అంటున్నాం కాబట్టి 

పని చేసే  వాడు , చెయ్యని వాడు సమానం  ... 

మంచి వాడు, చెడ్డ వాడు సమానం ... 

బాధ్యత గా ఉండే వాడు, ఏమి పట్టని వాడు సమానం ... 

అందువల్ల నాయకులు కూడా సరిఅయిన వారు ఉండరు   ... 

ఎవరిని ఎవరు సపోర్ట్ చేస్తారు అనే దాన్ని బట్టే నాయకుల ఎన్నిక ఉంటుంది కానీ సమర్థులను ఎన్నుకోరు ఎవరు ... 

పని ఎవరు తక్కువ చెపితే వారిని ఎన్నిక చేసుకొంటారు ... 

సోమరుల రాజ్యం అన్నమాట ... 

రెకమెండేషన్స్, రెఫరెన్సెస్ , కులం , మత , ప్రాంతీయ మొదలైన వాణ్ణి నాయకున్ని డిసైడ్ చేస్తాయి ... 

సమర్ధుణ్ణి, నీతి, నిజాయతీ,నిబద్దత  ఉన్న వాళ్ళను కాకుండా 

వారికి పనికొచ్చే నాయకున్ని ఎన్నుకొంటారు ... 
ఎన్ను కొంటున్నారు ... 

ఇవన్నీ ఒక తత్వవేత్తలోనే ఉంటాయి  ... 

కనుక తత్వ వేత్తల రాజ్యం రావాలి  లేదా 

బాధ్యత తో కూడిన ప్రజాస్వామ్య రాజ్యం రావాలి ... 


స్వస్తి  ... 

మరో మంచి విశ్లేషణ, వివరణ లతో మరో సమాజం కోసం కృషి  చేద్దాం ... 


నేటి విద్యార్థులే రేపటి దేశ  భవిష్యత్తు అని మరో సారి గుర్తు చేస్తూ 

మీ శ్రీ 

జైహింద్ ... 


Tuesday, November 22, 2016


ఓం అనే శబ్దం ఓంకారం గా పిలువబడుతోంది. అది ప్రణవనాదం.

సాధారణ మానవులకు వేదం పఠనం అనేది అందని ద్రాక్ష గా ఉండేది ప్రాచీన యుగం లో. చాలా మత గ్రంధాలు కూడా దేవాలయ మరియు రాజా వారి భూస్వాముల ఆధీనం లో ఉండేవి. మత పఠనం అనేది చాలా అరుదైన విషయం. అప్పడు ఒకే మతం ఉండేది అదే సనాతన ధర్మం. కానీ మత గ్రంధములు శ్లోకాలతో ఉండేవి.
సామాన్యులకు ఒకే ఒక పదం ద్వారా దైవ ధ్యానం ఫలాన్ని అందించాలని ఓంకారం ని భోధించేవాడు .
ఓం అనేది అ, ఉ మ ల సమ్మేళనం. ఇది నిస్వార్ధ భక్తి పరులకు అలౌకిక ఆనందాన్ని, ఎంతో మానసిక ప్రశాంతాత ను కలుగ చేయటమే కాక వేద పఠన ఫలాన్ని అందిస్తుంది.

అందుకే జపించండి .../
ఓం నమః శివాయ (శివ నామం స్మరణ )
ఓం నమో నారాయణాయ (విష్ణు నమ్మ స్మరణ )
ఓం సురభ్యై  నమః (గోమాత స్మరణ)
గోమాత స్మరణ ఎందుకంటే సకల దేవతలు నివాసం ఉండేది తనలోనే.
సర్వే జనా సుఖినో భవంతు ...
ఇట్లు అందరి శ్రేయోభిలాషి మీ శ్రీ